అక్కినేని నాగచైతన్య నటిస్తున్నలేటెస్ట్ మూవీ తండేల్. నాగ చైతన్య 23 వ సినిమాగా తెరకెక్కుతుంది. నాగ చైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం. ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్‌డేట్ బయటకు రిలీజ్ చేస్తూ మూవీ లవర్స్, అభిమానుల్లో జోష్ నింపుతోంది చైతూ టీం. తాజాగా చైతూ తండేల్ షూటింగ్ లొకేషన్ స్టిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చైతూను ఇదివరకెన్నడూ కనిపించని విధంగా సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నట్టు తాజా స్టిల్ చెప్పకనే చెబుతోంది.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ తెరకెక్కుతుండగా, గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, సాయిపల్లవి సత్య పాత్రలో అందరినీ ఇంప్రెస్ చేయబోతున్న ఇంట్రడక్షన్ వీడియో చెప్పకనే చెబుతోంది. తండేల్ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.