Namaste NRI

తండేల్‌  కీలక షెడ్యూల్‌ కంప్లీట్

నాగచైతన్య నటించిన చిత్రం తండేల్‌. సాయిపల్లవి కథానాయిక. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. నాగచైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయింది. సాయిపల్లవితో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్య ఘట్టాలను చిత్రీకరించామని దర్శకుడు తెలిపారు.

ఈ సందర్భంగా వర్కింగ్‌ స్టిల్స్‌ను విడుదల చేశారు. అనుకోని పరిస్థితుల్లో పాకిస్థాన్‌ సైన్యానికి చిక్కిన ఓ జాలరుల బృందానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? పాకిస్థాన్‌ సైన్యం చేతిలో బందీలుగా మారిన వాళ్లు ఎలా బయటపడ్డారన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని, దేశభక్తి, ప్రేమ అంశాలతో ఆకట్టుకుం టుందని చిత్రబృందం పేర్కొంది. యథార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రియల్‌ లోకేషన్స్‌లో షూటింగ్‌ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, సమర్పణ: అల్లు అరవింద్‌, నిర్మాత: బన్నీ వాసు, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events