
శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా నటిస్తున్న చిత్రం జీరో. లక్ష్మీనారాయణ సి దర్శకుడు. ఆర్.లక్ష్మణ్‌రావు, ఆర్.శ్రీను నిర్మిస్తున్నారు. టైటిల్ ప్రకటనతో పాటు గ్లింప్స్‌ని ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి విడుదల చేశారు. లవ్, ఫ్యామిలీఎమోషన్స్ ప్రధానంగా స్పోర్ట్స్ నేపథ్య కథాంశమిదని దర్శకుడు తెలిపారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో స్పోర్ట్స్ ఆడే ఉంటారని, వారందరికి స్ఫూర్తినిచ్చే ఇతివృత్తమని నిర్మాతలు పేర్కొన్నారు. స్ఫూర్తివంతమైన కథగా ఆకట్టుకుంటుందని హీరో విజయ్‌రాజా అన్నారు. రాజేంద్రప్రసాద్, ఆమని, శివాజీరాజా, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్.
