Namaste NRI

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు టాంజానియా ఎన్‌ఆర్‌ఐ విభాగం మద్దతు

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌  బిల్లు ఆమోదానికి భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత  చేపట్టిన ఉద్యమానికి బీఆర్ఎస్  టాంజానియా ఎన్‌ఆర్‌ఐ విభాగం  మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్‌ బిగాల పిలుపు మేరకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు టాంజానియా బీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు వంగ నర్సింహారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగృతి  సంస్థ ద్వారా బతుకమ్మ పండుగ , తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన కవిత మహిళా రిజర్వేషన్‌ బిల్లును సాధిస్తారని అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. భారత్‌లో ఉంటూ బ‌తుక‌మ్మ పండుగ ప్రాముఖ్యాన్ని విదేశాల్లో ఉన్న తెలుగువారి పిల్లలకు వివరించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

గత యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిందని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో ఆమోదించాలంటే పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలని అధికార బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతుందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలంటూ ఇటీవల కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టి రిజర్వేషన్‌ ఆవశ్యకతను మరోసారి మహిళా లోకానికి గుర్తు చేశారని వివరించారు.

 ఈ కార్యక్రమంలో  ఎన్ఆర్ఐ టాంజానియా అడ్వయిజర్స్‌ సంతోష్ రెడ్డి పట్లోల, సురేందర్ సెలం,సూర్య మోహన్ రెడ్డి , మధురెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీనిలై, చారి గుడికందుల, ప్రణీత్ రెడ్డి, వెంకటేష్, రాజేష్, మహేష్ రెడ్డి, సురేష్, రాజు, పెర్రి కౌశిక్, శేషు, శ్రవణ్, శ్రీనివాస్, శ్రీధర్, ప్రవీణ్, మధుసూదన్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events