Namaste NRI

అమెరికా పయనమైన తారక్

ఆస్కార్ కోసం టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్  అమెరికాకు బయల్దేరాడు. మార్చి 13న ఆస్కార్ అవార్డుల వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ (రామ్ చరణ్, రాజమౌళి , కీరవాణి) యుఎస్ కు వెళ్లింది. తాజాగా ఎన్టీఆర్ కూడా అమెరికాకు పయనమయ్యాడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో  తారక్ కనిపించారు. ఇటీవల సోదరుడి అకాల మరణం కారణంగా అమెరికాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయిన తారక్, తాజాగా అమెరికా పయనమవడంతో ఫాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.  ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న నాటునాటు్ణ సాంగ్ ఆస్కార్ అవార్డు కోసం మరో 4 ప్రముఖ ట్రాక్ లతో పోటీ పడుతున్న ముచ్చట తెలిసిందే.  ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events