Skip to main content

Namaste NRI

కీడా కోలా నుంచి త‌రుణ్ బాస్కర్ ఫ‌స్ట్ లుక్.. త్వ‌ర‌లోనే టీజ‌ర్ రిలీజ్‌

యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ కీడా కోలా తో చేస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నాయుడుగా తరుణ్ భాస్కర్ లుక్ ని రివిల్ చేశారు. చేతిలో గన్ నోట్లో సిగరెట్ తో వైలెంట్ గా కనిపించిన తరుణ్ భాస్కర్ లుక్ సర్ప్రైజ్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో శ్వాస మీద ధ్యాస అనే క్యాప్షన్ ఆసక్తికంగా వుంది.దీంతోపాటు ఈ చిత్రం టీజర్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు మేకర్స్. జూన్28 కీడా కోలా టీజర్ విడుదల చేస్తున్నారు. కాగా కీడా కోలాలో హాస్య బ్ర‌హ్మ బ్రహ్మానందం ఒక ప్రత్యేకమైన రోల్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.  అలాగే తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది చిత్రం ఐదేళ్లను పురస్కరించుకుని జూన్ 29న ఎంపిక చేసిన థియేటర్లు & క్లబ్‌లలో రీరిలీజ్ చేస్తున్నారు. 28న టీజర్ చూసి, 29న మీ గ్యాంగ్ తో కలిసి సినిమాకి రండి. చూసుకుందాం  అని మేకర్స్ తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events