Namaste NRI

సీతారామం లో తరుణ్‌ భాస్కర్‌ ఫస్ట్‌ లుక్‌

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం సీతారామం. ఈ సినిమాలో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ బాలాజీ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రను పరిచయం చేస్తూ  చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది. బాలాజీ ఉన్నాడు..అంతా చూసుకుంటాడు అనే డైలాగ్‌ ఈ వీడియోలో వినిపించింది. గౌతమ్‌ మీనన్‌, ప్రకాష్‌ రాజ్‌, శత్రు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పీఎస్‌ వినోద్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events