Namaste NRI

రాష్ట్ర సాధనలో టీడీఎఫ్ కీలక పాత్ర : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్ర సాధనలో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం  కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ప్రవాసీ తెలంగాణ దివస్‌ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు ఎంతో కీలక పాత్ర పోషించరన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అందరూ కలిసి పోరాడినట్లుగానే పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి ఐక్యంగా పాటుపడాలని కోరారు. మంచి పనులను అభినందించిన విధంగానే అన్యాయం జరిగితే ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా టీడీఎఫ్‌పౖౖె ఉందన్నారు. తెలంగాణ సాధనలో ప్రాణాలర్పించిన వారిలో యువకులే ఎక్కువని, వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

                తెలంగాణ అభివృద్ధిలోఎన్‌ఆర్‌ఐల పాత్ర విస్మరించలేనిదని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దూర దేశాల్లో ఉన్నప్పటికీ సొంత ఊర్లను మరిచిపోని తెలంగాణ బిడ్డలని మంత్రి తెలిపారు. ఉద్యమ సమయంలో టీడీఎఫ్‌ను ఏర్పాటు చేసి కీలకంగా పని చేశారని కొనియాడారు. మరికొందరు ఉద్యమంలో భాగస్వాములయ్యాయరన్నారు. అలాంటి బిడ్డలకు సీఎం కేసీఆర్‌ అనేక అవకాశాలు కల్పించారని మంత్రి తెలిపారు. ఎన్నారైలు తెలంగాణలో పెట్టుబడులు  పెట్టెందుకు ముందుకు రావాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్‌ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ కోదండరాం, మాడభూషి శ్రీధర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం అధ్యక్షురాలు కవితా చెల్లా, ఉపాధ్యక్షురాలు ప్రీతి, పీవీ రావు, ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, రాజిరెడ్డి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events