
ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ లో టీడీపీ గెలుపు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నా రై టీడీపీ తరఫున ప్రకటించిన లక్ష ఉద్యోగ అవకాశాలను అమలుపరచాలని కోరారు. వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కోట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. తెలుదేశం మెల్‌బోర్న్ కమిటీ ఆధ్వర్యంలో న భూతో న భవిష్యత్ అనేలా సభను నిర్వహించారు. మెల్‌బోర్న్ టీడీపీ పార్టీ అధ్యక్షుడు లగడపాటి సుబ్బారావు ఆధ్వర్యంలో సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 1100 మంది టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు విజయోత్సవ సంబరాలకు హాజరై సభను జయప్రదం చేశారు.

