అభివృద్ధీకరణకు ఆద్యుడు ఎన్టీఆర్ అని ఎన్.ఆర్.ఐ టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. ఈ నెల 15న కోమటి జయరాం అధ్యక్షతన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 6వ మహానాడు, ఎన్ఆర్ఐ టీడీపీ మేరీల్యాండ్ విభాగం వారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. మేరీ ల్యాండ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ అత్యుత్సాహంతో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి, అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావాలి, క్షీణిస్తున్న శాంతిభద్రతలు-ఆగని వేధింపులు- అక్రమ అరెస్ట్లు, సభ్యత్వ నమోదు – పార్టీ సంస్థాగత నిర్మాణం మొదలైన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెడతారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, తదితరలు పాల్గొంటారు.
