![](https://namastenri.net/wp-content/uploads/2024/06/Ixora-38.png)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే తిరుగులేని విజయం సాధించడంతో దుబాయ్, అట్లాంటాలలో టీడీపీ ఎన్నారై విభాగం నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. దుబాయ్ లో మహిళలు, యువత, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీడీపీ ఎన్నారై విభాగం దుబాయ్ బృంద ప్రతినిధులు సునీల్, మోహన్ మురళీ, ఆత్కూరి శివ, రాధాకృష్ణ పాల్గొన్నారు. అట్లాంటాలో జరిగిన సంబరాల కు తెలుగు మహిళలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ, జనసేన జెండాల్ని ప్రదర్శించి, ఎన్డీయే నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/06/gh060624main28b-1.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2024/06/Mayfair-38.jpg)