ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తీస్‌మార్ ఖాన్. మూడు పాత్రల్లో ఆది సాయి కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. హీరో హీరోయిన్లపై రొమాంటిక్ పాటని చిత్రీకరిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. పాయల్ రాజ్‌పుత్ పాత్ర కూడా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రను ఆమె పోషిస్తుంది. గోవాలో చిత్రీకరిస్తున్న రొమాంటిక్ పాట యువతరాన్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది అన్నారు. ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ నాయిక. హైయాక్షన్ వోల్డేజ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. కల్యాణ్ జిగోగణ దర్శకత్వం వహిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. ఛాయాగ్రహణం: మణికాంత్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)