దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రాజెక్ట్ అహింస. లవ్ స్టోరీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై పీ కిరణ్ తెరకెక్కిస్తున్నారు. ప్రేమకథ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో గీతికా హీరోయిన్గా నటిస్తోంది. 20 ఏండ్ల క్రితం తేజ డైరెక్షన్లో లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన జయం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సదా ఈ చిత్రంలో లాయర్‌గా కనిపించనుండటం విశేషం.
హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్‌తోపాటు ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ చుట్టూ తిరుగుతూ సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చేశాడు తేజ. అహింసలో యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని విలన్‌గా నటిస్తున్నాడు. రజత్ బేడి, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవీ ప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.