Namaste NRI

సింగపూర్ లో తెలంగాణ అలయ్ బలయ్

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టిసిఎస్ఎస్) ఆధ్వర్యంలో ఫ్యామిలీ డే ను తెలంగాణ బలగం అలయ్ బలయ్-2023  పేరిట సింగపూర్ పుంగ్గోల్ పార్క్‌లో ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని, ఆటలను భావి తరాలకు అందించడానికి టిసిఎస్ఎస్ సభ్యులు వివిధ రకాల భారతీయ సంప్రదాయ ఆటలైన సంచి దుంకుడు, అష్టాచెమ్మ, పచ్చీస్, కచ్చకాయలు, గోళీలాట, తొక్కుడు బిళ్ళ, చార్ పల్లి, కోకో, చిర్రగోనే మొదలగు ఆటలు ఆడించి బహుమతులు అందించారు. ఈ అలయ్ బలయ్‌లో తెలంగాణ వంటలు అయినటువంటి సర్వపిండి, పచ్చి పులుసు, చల్ల చారు, బాగారా మొదలగు నోరూరించే వంటకాలు అందరికి రుచి చూపించారు. ఈ ఫ్యామిలీ డేలో సుమారు 400 వరకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ప్రవాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెండు తెలుగు రాష్ట్రాల వారు మాట్లాడుతూ టిసిఎస్ఎస్ మొదటి నుండి ఎలాంటి హంగు ఆర్భాటాలు, లాభాపేక్ష లేకుండా చేస్తున్న కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శప్రాయం, అభినందనీయం అన్నారు.  ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, రాధికా రెడ్డి నల్ల, కల్వ లక్ష్మణ్ రాజు, శ్రీకాంత్ కొక్కుల వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నాగ భూషణ్ రెడ్డి, రమాదేవి మల్లారెడ్డి, సందీప్. ఎమ్ మరియు ముశ్రమ్ మహేష్ తదితరులు తమ ఇంటి రుచులను అందరికీ చూపారు.

టిసిఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ బలగం అలయ్ బలయ్ విజయవంతంగా జరుగుటకు సహకరించి ప్రతి ఒక్కరికి, సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్‌లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి, స్పాన్సర్స్‌కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమ స్పాన్సర్స్ ఏపిజే అభిరామీ జువెల్లర్స్, మై హోమ్ సయుక్, జోయాలుకాస్, ఎస్ పి సిస్ నెట్, వైష్ణవి ఇన్ ఫ్రా మరియు గరంటో ఎకాడమి వారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.

ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events