తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారుదే జోరు కనిపిస్తుంది. బిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టనుందని నేషనల్ సెఫాలజీ ఇన్స్టిట్యూట్ ఒపీనియన్ పోల్ అధ్యయనంలో తేలింది. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి 74 సీట్లలో విజయం సాధిస్తుందని వెల్లడించింది. గులాబీ పార్టీ 74 సీట్లకు అదనంగా 5 పెరుగొచ్చు లేదా తగ్గొచ్చు అని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 29 సీట్లు (3 ప్లస్ ఆర్ మైనస్), బిజెపి 6 సీట్లు (2 ప్లస్ ఆర్ మైనస్), ఎఐఎంఐఎం 7 సీట్లు(1 ప్లస్ ఆర్ మైనస్) గెలిచే అవకాశం ఉందని ఒపీనియర్ పోల్ స్పష్టం చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించిన ప్రీ పోల్ ఒపీనియన్ ఫలితాలను నేషనల్ సెఫాలజీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. ఈ ప్రీ పోల్ అధ్యయనం ద్వారా తెలంగాణలో సిఎం కెసిఆర్ ప్రజా పాలన అందిస్తున్నారని మరోసారి స్పష్టమైంది. అన్ని స్థానాలలో అభ్యర్థులు ఖరారైన తర్వాత ప్రీ పోల్ తుది ఫలితాలను వెల్లడిస్తామని నేషనల్ సెఫాలజీ ఇన్స్టిట్యూట్ తెలిపింది.