“తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా గురువారం, సెప్టెంబర్ 9, 2021న తెలంగాణా భాషా దినోత్సవ వేడుకలు అంతర్జాలంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో లబ్ద ప్రతిష్ఠులైన సాహితీవేత్తల జీవన ప్రస్థానాన్ని వారి కుటుంబ సభ్యులే ఆవిష్కరించే అపూర్వ ఘట్టంతో తెలుగు సాహిత్య చరిత్రలో సరికొత్త కోణాన్ని సృష్టించిన కుటుంబ సభ్యులకు, విశిష్ట అతిధులకు, సాహితీ ప్రియులకు, ప్రసార మాధ్యమాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.