Namaste NRI

బ్రిటన్ ఎన్నికల బరిలో లేబర్ పార్టీ ఎంపీ అభ్యర్థి గా … తెలంగాణ బిడ్డ

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో  పోటీకి తెలంగాణ బిడ్డ ఎంపిక య్యాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు  లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు. ఈ మేరకు లేబర్ పార్టీ నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ పార్లమెంటరీ కాండిడేట్‌గా ఆ పార్టీ ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎన్నికల హడావిడి మొదలయింది. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంత రావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు ఉదయ్‌. చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచెలుగా ఎదిగారు. బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్‌లో పాలనా శాస్త్రంలో పీజీ చేసారు. భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనేథింక్-ట్యాంక్‌ను నెలకొల్పారు.

అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్‌కు మంచి పట్టు ఉంది. స్కూల్ గవర్నర్‌గా, వాలంటీర్‌గా, రాజకీయ ప్రచారకుడిగా దశాబ్దకాలంగా ఇంటింటికీ ప్రచారంలో పాల్గొంటూ సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు. వచ్చే ఎన్నికల్లో లేబర్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. దీంతో తెలుగు ముద్దు బిడ్డ ఉదయ్ కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది. రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయిల్ -పాలస్తీనా సంఘర్షణ, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలోఈ ఎన్నికల మీద ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events