సింగపూర్‌లో నివసిస్తున్న తెలంగాణ వాసులందరూ ఒక్క తాటిపై ఉండి కష్ట సుఖాలు పంచుకోవాలని తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్ టీసీఎస్‌ఎస్) కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. సింగపూర్ లో తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యుల మీట్ అండ్ గ్రీట్ -2022 జరిగింది. లిటిల్ ఇండియాలోని ద్వారక రెస్టారెంట్‌లో జరిగిన విందు సమావేశానికి సొసైటీ ఆహ్వానం మేరకు 50-60 మంది టీసీఎస్‌ఎస్ లైఫ్‌టైం సభ్యులు హాజరయ్యారు. బతుకమ్మ సంబురాల నిర్వహణకు రూపొందించిన కరపత్రిక, ప్రోమోను విడుదల చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే అక్టోబర్ ఒకటో తేదీన సంబవాంగ్ పార్క్‌లో బతుకమ్మ వేడుకలు జరుపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.
ఈ సమావేశంలో టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, పెరుకు శివ రామ్ ప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, భాస్కర్ నడికట్ల, శివ ప్రసాద్ ఆవుల,రవి కృష్ణ విజాపూర్ పాల్గొన్నారు.