Namaste NRI

మలేషియాలో తెలంగాణ దశాబ్ది వేడుకలు

మలేషియాలో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధన కోసం అమరుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మలేషియా ఎన్‌ఆర్‌ఐ శాఖ అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో ఉద్యమ నేత కేసీఆర్‌ సబ్బండ వర్ణాలను ఏకం చేసి తెలంగాణను శాంతియుతంగా సాధించారని అన్నారు.గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ని ఆయన వివరించారు. తెలంగాణ మాదిరిగా భారత దేశం అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ గా మార్చారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ లక్ష్యాల కోసం మలేషియా ఎన్‌ఆర్‌ఐ శాఖ తమ వంతు కృషి చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడు మారుతి కుర్మ, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, మైటా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య, మైటా ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి , కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, హరీష్ గుడిపాటి, సంపత్ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, సభ్యులు శ్యామ్, పూర్ణ చందర్ రావు, నవీన్ గౌడ్ పంజాల, కిషోర్, క్రాంతి , గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events