అమెరికాలో జరుగుతున్న ‘ఆట’ (ATA) మహాసభల్లో తెలంగాణ డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క రెండవ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలకు విచ్చేసిన ప్రవాస తెలుగు వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. ఖండాంతరాల్లో కూడా మన తెలుగు వారు ఐకమత్యంతో మన సంస్కృతిని చాటిచెబుతుండటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఈ సందర్భంగా ఆటా అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల ఇతర ఆటా సభ్యులు, ప్రవాస తెలుగువారు తో ఆత్మీయంగా పలకరించారు, ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు.
































