Namaste NRI

అభివృద్ధిలో తెలంగాణ పరుగులు : చింతకుంట మహేంద్‌

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ పాలనలోను రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఖతార్‌ యువజన విభాగం అధ్యక్షుడు చింతకుంట మహేంద్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 21 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖతార్‌ ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహేందర్‌ మాట్లాడుతూ 2001లో ఏర్పడిన టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్‌ ఏరియా ఇంచార్జ్‌ సుందరగరి శంకర్‌, సీనియర్‌ నాయకులు తాళ్లపల్లి ఎల్లయ్య, బత్తిని భాస్కర్‌గౌడ్‌, సంగం శ్రీనివాస్‌, మాసం రాజారెడ్డి కందురి రాజు, మోతే ప్రవీణ్‌, మిస నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News