త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమదేశం. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించారు. శిరీష్ సిద్ధమ్ నిర్మాత. మణిశర్మ స్వరకర్త. మాయా, అజయ్ కతుర్వార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని తెలవారినేమో నా సామి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఒకప్పటి సూపర్‌హిట్ సినిమా ప్రేమదేశం టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడంతో మా టీమ్ అందరిపై బాధ్యత పెరిగింది. కాలేజీ నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రతి ఒక్కరికి తమ కాలేజీ రోజుల జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది అన్నారు. ప్రేమకథతో పాటు మదర్‌సెంటిమెంట్ ప్రధానంగా సినిమా ఆకట్టుకుంటుందని హీరో త్రిగుణ్ తెలిపారు. ఒకప్పటి బ్లాక్‌బస్టర్ సినిమా టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో నటించడం గొప్ప అనుభవాన్నిచ్చిందని నాయిక మేఘా ఆకాష్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సజాద్ కాక్కు, సంగీతం: మణిశర్మ, నిర్మాణ సంస్థ : సిరి క్రియేటివ్ వర్క్స్
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)