రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తానంటే భయమని, ఇదే విషయాన్ని తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చెప్పానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. పుతిన్ తనకు, అమెరికాకు మాత్రమే భయపడతాడని జెలెన్‌స్కీ పేర్కొన్నాడు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో సమావేశమైన విషయాన్ని జెలెన్‌స్కీ సోషల్ మీడియాలో వెల్లడించారు.
ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనే బలమైన సంకల్పంతో ఉన్నారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. యుద్ధానికి ముగింపు ఎలా పలుకాలనే విషయంపై తామంతా కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. పారిస్‌లో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించామని వెల్లడించారు. పుతిన్ తనకు, అమెరికాకు మాత్రమే భయపడుతాడని అన్నారు.