అమెరికా ఫారిన్ సర్వీసు, సీనియర్ అధికారి, తెలుగు బిడ్డ వీణారెడ్డి భారత్‌లో యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ ఎయిడ్) నూతన మిషన్ డైరెక్టర్‌గా ఢల్లీిలో బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని భారత్‌లో అమెరికా తాత్కాలిక రాయబారి అతుల్ కేశప్ ప్రకటించారు. మిషన్ డైరెక్టర్‌గా వీణారెడ్డి ఇండియా, భూటాన్‌లో యూఎస్ ఎయిడ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. శాంతియుత, సౌభాగ్యవంతమైన సమాజ స్థాపన కోసం యూఎస్ ఎయిడ్ గత ఏడు దశాబ్ధాలుగా ప్రజలతో, భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని వీణారెడ్డి చెప్పారు. మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు.
ఇండియా, భూటాన్ లో యూఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్‌గా పనిచేయనున్న మొదటి ఇండియన్ అమెరికన్‌గా వీణారెడ్డి గుర్తింపు సాధించారు. వీణారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. అమెరికాలో పెరిగారు. షికాగో యూనివర్సిటీలో బీఏ, ఎంఏ పూర్తి చేశారు. కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టర్ ఆఫ్ జ్యురిస్‌ఫ్రుడెన్స్ పట్టా అందుకున్నారు. న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్, లండన్‌లో కార్పొరేట్ అటార్నీగా సేవలందించారు. అనంతరం అమెరికా ఫారిన్ సర్వీసు అధికారిగా ఎంపికయ్యారు. హైతీలో యూఎస్‌ఎయిడ్ డిప్యూటీ మిషన్ డైరెక్టర్‌గా, కాంబోడియాలో మిషన్ డైరెక్టర్‌గా పని చేశారు.