తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలను వచ్చే నెల 19న నిర్వహిస్తామని అధ్యక్షుడు సి కళ్యాణ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ, వైవీఎస్ చౌదరి, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి కళ్యాణ్ మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మూలధనం దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేదు. మా కౌన్సిల్లో 9 కోట్ల రూపాయల ఫండ్ ఉంది. అలాగే తిరుపతిలో సొంత భవనం, హైదరాబాద్ మూవీ టవర్స్‌లో 2 కోట్ల 40 లక్షల పెట్టుబడి ఉంది. మూవీ టవర్స్ పెట్టుబడి ఇప్పుడు 10 కోట్ల రూపాయల విలువకు చేరింది. ఫిబ్రవరి 19న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం. అదే రోజు కౌంటింగ్, సర్వసభ్య సమావేశం నిర్వహిస్తాం. మా కౌన్సిల్ పై నిరాధార చేస్తూ, నిత్యం వివాదాలు సృష్టిస్తున్న సభ్యులు కె సురేష్ బాబును మూడేండ్ల పాటు, యలమంచిలి రవిచంద్పై జీవితకాలం నిషేధం విధిస్తున్నాం. అన్నారు. అదేవిధంగా ఎలక్షన్స్ జరగట్లేదు అని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు. వాటన్నింటికి సమాధానమే ఈరోజు మేము పెట్టుకున్న మీటింగ్. మాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదు. అందుకే ఎలక్షన్ తేదీని ప్రకటిస్తున్నాం. నేను ఎన్నికలకి పోటీ చేయదలచుకోలేదు. నేను ఒకసారి ఒక పదవిలో ఉంటే మళ్ళీ ఆ పదవికి పోటీ చేయను అని తెలిపారు.
ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు ..
ఫిబ్రవరి ఫస్ట్ నుంచి 6 వ తేదీ వరకు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకరు ఒక పోస్ట్ కి మాత్రమే పోటీ చెయ్యాలి. 13వ తేదీ వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. కే దుర్గ ప్రసాద్ ఎన్నిక అధికారిగా కొనసాగబోతున్నారు. అదే రోజు సాయంత్రం ఈసీ మీటింగ్ జరుగుతుంది అని తెలిపారు.