అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మరణించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హారిక ఈ ప్రమాదంలో చనిపోయింది. హారిక తండ్రి శ్రీనివాసరావు దేవాదాయ శాఖలో పనిచేస్తున్నారు. తెనాలి కి చెందిన హారిక అమెరికాలోని ఒక్లహో మాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఏడాదిన్నర క్రితం వెటర్నరీ విద్యలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. తమ కుమార్తె మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు చొరవ తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఒక్లహోమాలో మూడు కార్లు ఒక దానితో ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. హారిక మృతితో శ్రీనివాసరావు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు, సన్నిహితులు హారిక కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.
