Namaste NRI

లండన్ లో తెలుగు అమ్మాయి హత్య 

విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. ఈ ఘటన బ్రిటన్ రాజధాని లండన్‌లో వెలుగు చూసింది. తేజస్విని రెడ్డి, అఖిల అనే ఇద్దరు తెలుగు యువతులపై బ్రెజిల్ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తేజస్విని అక్కడికక్కడే చనిపోయింది. మరో యువతి అఖిల తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తేజస్విని, అఖిల మరికొంత మంది స్నేహితులతో కలిసి లండన్‌లో ఉంటున్నారు.

ఎంఎస్‌ కోసం రెండున్నరేళ్ల క్రితం తేజస్విని లండన్ వెళ్ళింది. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్ విచ్‌లో చదువుతోంది. ప్రస్తుతం వెంబ్లి ప్రాంతంలోఉంటుంది. కాగా, దాడికి పాల్పడిన బ్రెజిల్‌కి చెందిన వ్యక్తి తేజస్విని ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండే వారని సమాచారం. తేజస్విని రెడ్డిది హైదరాబాద్ నగరంలోని చంపాపేట. ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఎలక్ట్రిషన్. ఆమె మూడు నెలల క్రితం హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే, ఆగస్ట్‌లో వస్తానని తేజస్విని తన తల్లితండ్రులతో చెప్పింది. దాంతో తేజస్వినికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు ఆమె తల్లి రమాదేవి అన్నారు. అంతలోనే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక దుండగుడి దాడిలో గాయపడిన మరో అమ్మాయి అఖిలది జనగాం జిల్లా ఆలేరుగా తెలిసింది. తేజస్విని మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి రప్పించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events