మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 కిరీటాన్ని తెలుగమ్మాయి నందితా బన్న కైవసం చేసుకున్నారు. నేషనల్ మ్యూజియమ్ సింగపూర్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో టైటిల్ కోసం మొత్తం 8 మంది యువతులు తుదిపోటీలో నిలవగా వారందరినీ వెనక్కు నెట్టి 21 ఏళ్ల నందిత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. నందిత కుటుంబం 25 సంవత్సరాల క్రితం సింగపూర్ వెళ్లి అక్కడే స్థిరపడిరది. ప్రస్తుతం ఆమె సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్పర్మేషన్ సిస్టమ్స్ కోర్సు చదువుతున్నారు. నందిత తల్లిదండ్రులు గోవర్థన్, మాధురిల స్వస్థలం శ్రీకాకుళం. ఈ ఏడాది డిసెంబరులో ఇజ్రాయెల్‌లో నిర్వహించనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో నందిత సింగపూర్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.