Namaste NRI

తెలుగు రాష్ట్రాల్లో పరిపాలనా భాషగా.. తెలుగు అమలు చేయాలి : వెంకయ్యనాయుడు

రామాయణ కాలంలోనూ తెలుగు భాష ఉందని ఇటీవల కొన్ని ఆధారాలను గుర్తించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గుంటూరులో మూడో తెలుగు మహాసభల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్పవారంతా తమ మాతృభాషలో చదువుకొనే ఉన్నత స్థానాలకు చేరుకున్నారని తెలిపారు. తెలుగు భాషను సజీవంగా ఉంచేందుకు ఎంతో మంది కృషి చేశారని కొనియాడారు. చాలా మంది మహనీయులు తెలుగు భాష ఉన్నతి కోసం శ్రమించారు. తెలుగువారు అయ్యుండి తెలుగు మాట్లాడకపోతే ఏదో లోపం ఉన్నట్లే లెక్క. అమ్మ అంటే అంతరాళం నుంచి వస్తుంది. అదే మమ్మీ అంటే నోటీ నుంచి మాత్రమే వస్తుంది. మాతృభూమిని, మాతృదేశాన్ని, మాతృమూర్తిని మరచినవారు పరిపూర్ణ మానవుడు కాదు. ఈ తరంలో తెలుగు భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. గుడి, బడి, అమ్మ ఒడిలో మాతృభాషనే మాట్లాడాలని అన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాతృభాషలోనే చదువుకున్నారు. మాతృభాషను మరిచిపోతే శ్వాస పోయినట్టే. తెలుగు భాషను కాపాడుకోవాలంటే తెలుగులో మాట్లాడితే చాలు. తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలు, కళాకారులు చేసిన త్యాగాన్ని గుర్తించాలి. ఇతర దేశాల్లో సాంకేతిక విద్య, ఇతర విద్యా కోర్సులు వారి మాతృభాషలోనే ఉంటున్నాయి. మన దేశంలోనూ ప్రధాని మోదీ మాతృభాషలోనే సాంకేతిక కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. స్థానిక ప్రభుత్వాలు కూడా మాతృభాషలోనే ఉత్తర్వులు ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలనా భాషగా తెలుగు అమలు చేయాలి. న్యాయస్థానాల్లో తెలుగు భాషను అమలు చేస్తే చాలా బాగుంటుంది అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events