అహ్మదాబాద్‌లో ఐపీఎల్ 16 ప్రారంభ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఓపెనింగ్ సెర్మనీలో పాపులర్ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తన పాటలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాడు. టాలీవుడ్ భామలు తమన్నా భాటియా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్ డ్యాన్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు. రష్మిక పుష్పలోని సామి సామి పాటకు మరోసారి ఇరగదీసే స్టెప్పులేసింది. మరోవైపు ఆస్కార్స్‌లో సత్తా చాటిన నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసి అదరగొట్టేసింది రష్మిక. తమన్నా సిల్వర్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ పుష్పలోని ఊ అంటావా మావా సాంగ్‌కు మెస్మరైజింగ్ స్టెప్పులతో హుషారెత్తించింది. వీరితోపాటు కియారా అద్వానీ కూడా స్టైలిష్ డ్యాన్స్ తో హోరెత్తించింది.

ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో ఒకప్పుడు ఎక్కువగా హిందీ పాటలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటి ఇప్పుడు తెలుగు, తమిళ పాటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఈరోజు తొలి ఐపీఎల్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఐపీఎల్ ప్రారంభ వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇవ్వడంపై రష్మిక మందన, తమన్నా భాటియా అంతకుముందు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
