తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో తెలుగు వారు ఆందోళన చేపట్టారు. దారుస్సలాంలోని జింఖానా గ్రౌండ్స్ నుంచి ప్రారంభించి ఓషియన్ రోడ్ వరకు పాదయాత్ర కొనసాగించారు. బాబుతో నేను పేరిట ఉన్న ప్లకార్డులను చేతబట్టుకొని పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రవాసీయులు సైతం పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. జాతీయ స్థాయి నాయకులు సైతం ఆయన అరెస్టును ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు చేస్తున్న వారికి మద్దతు పలికారు.
