భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆలయం నిర్మాంచారు. బీజేపీ కార్యకర్త అయిన మయూర్‌ముండే పుణెలోని అవుంద్ ప్రాంతంలో ఓ చిన్న గుడిని నిర్మించారు. గుడి కోసం ఎరుపురంగు చలవరాయిని జైపూర్ నుంచి తెప్పించారు. గుడి నిర్మాణానికి లక్షా 60 వేల రూపాయాలు ఖర్చయ్యాయని తెలిపారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తీసుకున్న పలు నిర్ణయాలకు కృతజ్ఞతగా ఆలయాన్ని నిర్మించినట్టు ముండే తెలిపారు. ట్రిపుల్ తాలాఖ్, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణం 370 రద్దు, అయోధ్యలో రామాలయం నిర్మాణం వంటి నిర్ణయాలు తీసుకున్నందుకు గుడి నిర్మించినట్లు ముండే తెలిపారు.