పంచతంత్రం ప్రీ రిలీజ్ వేడుక ఈవెంట్ బ్రహ్మానందం, స్వాతిరెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్న చిత్రం పంచతంత్రం. అఖిలేష్ వర్థన్, సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షపులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘపంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ పంచతంత్ర చాలా మంచి టైటిల్ అన్నారు. మూవీ టీజర్, ట్రైలర్ చాలా బాగా నచ్చిందన్నారు. ప్రశాంత్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడన్నారు. నటీనటులు చాలా చక్కగా నటించారని తెలుస్తోందన్నారు. టీం అందరికి ఆల్‌ది బెస్ట్ అని అన్నారు.
డైరెక్టర్ హర్ష పులిపాక మాట్లాడుతూ ఈవెంట్‌కి హరీష్ శంకర్‌గారు రావటం అనేది మాకు చాలా బలాన్నిచ్చింది. ఈ సినిమా రెండేళ్ల కష్టం. నిజాయతీగా చేసిన ప్రయత్నం. సింపుల్ కథలను అందంగా మీ ముందు చూపించే ప్రయత్నం చేశాం అన్నారు. నిర్మాత అఖిలేష్ వర్థన్ మాట్లాడుతూ మా టీమ్‌కి సపోర్ట్ చేయటానికి వచ్చిన హరీష్ శంకర్‌గారికి, జీవితా రాజశేఖర్‌గారికి ధన్యవాదాలు. మా సినిమాలో నటీనటులు ఎంతో సపోర్ట్ చేశారు. హర్ష అండ్ ఇతర టెక్నీషియన్స్‌కు థాంక్స్. సృజన్‌గారికి థాంక్స్. సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడుతాను అన్నారు. ఈ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్, నటి స్వాతి, శివాత్మిక రాజశేఖర, నిర్మాత అఖిలేష్ వర్థన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భువన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఉష, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారి, నటి విద్య, నటి దివ్యశ్రీపాద, పాటల రచియత కిట్టు విస్స ప్రగడ పాల్గొన్నారు.