అమెరికా, రష్యా మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నల్లసముద్రంపై అమెరికాకు చెందిన ఓ డ్రోన్‌ను రష్యా యుద్ధవిమానం కూల్చివేయడమే ఇందుకు కారణం. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బ తింటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా చర్య దుస్సాహసమని పేర్కొన్నది. ఈ ఘటనపై అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్టు వైట్‌హౌజ్ అధికారి ఒకరు తెలిపారు.