భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తూర్పు లఢక్లో విధులు నిర్వహిస్తున్న తమ దేశ సైన్యంతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? అని ఆయన వారిని ప్రశ్నించడం చర్చనీయాంశం అయింది. అలాగే సరిహద్దుల్లో పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నిరంతరం కట్టుదిట్టంగా భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు జవాన్లు బదులిచ్చారు. ఈ సందర్భంగా జవాన్లలో ఉత్తేజం నింపిన జిన్పింగ్, వారికి తాజా ఆహార పదార్థాలు అందుతున్నాయో లేదో వాకబు చేశారు.