శ్రీరామ్, అవికా గోర్ జంటగా నటిస్తున్న చిత్రం టెన్త్‌క్లాస్ డైరీస్. ఈ సందర్భంగా నిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ వాస్తవ ఘటనలతో టెన్త్‌క్లాస్ డైరీస్ రూపొందించాం. పదోతరగతి చదివిన ప్రతి ఒక్కర్నీ ఈ చిత్రం ఆ రోజుల్లోకి తీసుకవెళ్తుంది. టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. టెన్త్ క్లాస్ నేపథ్యంలో సినిమాలో వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. ఈ చిత్రాన్ని నైజాంలో ఏషియన్ సునీల్‌కి చెందిన గ్లోబల్ సినిమాస్ విడుదల చేస్తోంది అన్నారు. శ్రీనివాసరెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివబాలజీ తదితరులు నటిస్తున్నారు. అంజి దర్శకుడు. అచ్యుత రామారావు, పి.రవితేజ మన్యం నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం : గరుడవేగ అంజి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)