కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి తాజాగా కొన్ని కీలక మార్పులు చేసింది. ఇకపై ఎట్ రిస్క్ దేశాలు (కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలు) నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఐసోలేషన్ తప్పనిసరి కాదని పేర్కొంది. అంతేకాకుండా ఈ దేశాల ప్రయాణికులు కరోనా పాజిటివ్‌గా తేలిన పక్షంలో వారి నుంచి సేకరించిన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ నిమిత్తం ఐఎన్ఎస్ఏసీఓజీ నెట్వర్క్ పరిధిలోని లాబొరేటరీలకు పంపాలని కేంద్రం తన తాజాగా మార్గదర్శకాల్లో పేర్కొంది. జనవరి 22 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీటినే అమలు చేయాలని అధికారులకు సూచించింది. అయితే సవరించిన మార్గదర్శకాలు మినహా మిగతా నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)