అమెరికాలోని న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్ వెస్ట్ బ్రోంక్స్‌లోని 19 అంతస్తుల అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులతో పాటు 19 మంది మృతి చెందారు. 60 మందికి పైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో 13 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి 200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ పేర్కొంది. చెలరేగిన దట్టమైన పొగ పీల్చడం వల్ల చాలా మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ స్పందిస్తూ గత 30 ఏళ్లలో నగరంలో అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదమని తెలిపారు. అపార్టుమెంట్‌లోని ప్రతి అంతస్తులోనూ బాధితులు ఉన్నారని తెలిపారు. అమెరికా చరిత్రలో జరిగిన అగ్నిప్రమాదాల్లో ఇదొకటిగా మిగిలిపోతుందన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)