
ఉగ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 2019లో క్రైస్ట్‌చర్చ్ నగరంపై జరిగిన దాడి అయినా, 2008లో ముంబైపై జరిగిన దాడి అయినా తమ వైఖరి ఒకటేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తమ సహకారాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో భేటీ అనంతరం మోదీ పై విధంగా స్పందించారు. న్యూజిలాండ్‌లో కొన్ని శక్తులు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయాన్ని ఆ దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇక భేటీలో భాగంగా వాణిజ్యం, రక్షణ, విద్య, వ్యవసాయం లాంటి రంగాలపై వారి మధ్య చర్చలు జరిగాయి.
