ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా కల్యాణ్ జి.గోగణ తెరకెక్కించిన చిత్రం తీస్ మార్ ఖాన్. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ సినిమా చూశాను. మేము అనుకున్న దానికన్నా చిత్రం ఎంతో బాగా వచ్చింది. ఇందులో ఆది కాలేజీ విద్యార్థి, రౌడీ, పోలీసు మూడు పాత్రల్లో కనిపిస్తారు. సినిమా చూసిన తరువాత విజయంపై మరింత నమ్మకం పెరిగింది. అవి వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. కచ్చితంగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి.














