తమ సమస్యలను పరిష్కారం చూపాలంటూ ఎగ్జిబిటర్లు తెలంగాణ థియేటర్ల యాజమన్యాలు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నెం.63ను సవరిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పార్కింగ్ ఫీజులు వసూలు చేసేందుకు వీలు కల్పించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిశారు. తమ సమస్యలకి పరిష్కారం చూపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి, సత్కరించారు.