భూమి పెడ్నేకర్ నటిస్తున్న తాజా చిత్రం థాంక్యూ ఫర్ కమింగ్ . రైజ్, రెబల్, రిపీట్ అనేది ఉపశీర్షిక. యంగ్ ఉమెన్స్ (చిక్ ఫ్లిక్)తో రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పొస్టర్‌తో పాటు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.ఫెయిరీ టేల్‌లో ప్రతి రాకుమారి కథ ఒకలాగే ఉంటుంది. ఒక కప్పని సెలెక్ట్ చేసుకుని దాన్ని కిస్ చేయగానే అది ప్రిన్స్‌లాగా మారతాడు. ఆ తరువాత వాళ్లు చాలా హ్యాపిగా ఉంటారు. నాకు కుడా అలానే అనిపించింది. కానీ నాకెప్పుడూ భావప్రాప్తి అవ్వలేదంటూ ట్రైలర్ సాగింది. ఇక ట్రైలర్ గమనిస్తే మహిళల కోణం నుంచి సెక్స్‌వల్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి అనేది సినిమా స్టోరీగా తెలుస్తుంది.
బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా, రియా కపూర్ భర్త కరణ్ బూలానీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భూమితో పాటు షెహనాజ్ గిల్ , అనిల్ కపూర్ , కుషా కపిల, నటాషా రస్తోగి ప్రధాన పాత్రలు షోషించారు. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.