Namaste NRI

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌ ను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్.. ప్రదీప్ రంగనాథన్

ప్రదీప్‌ రంగనాథన్‌  కథానాయకుడిగా రూపొందిన చిత్రం రిటర్న్‌ ఆఫ్‌ది డ్రాగన్‌. అనుపమా పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ కథానాయికలు. అశ్వత్‌ మారిముత్తు దర్శకుడు. కల్పాతి ఎస్‌.అఘోరం, కల్పాతి ఎస్‌.గణేష్‌, కల్పాతి ఎస్‌.సురేష్‌ నిర్మాతలు. గత నెల 21న విడుదలైన ఈ సినిమా వందకోట్ల క్లబ్‌లో జాయిన్‌ అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో ప్రదీప్‌ రంగనాథన్‌ మాట్లాడారు. ప్రయత్నిస్తే కచ్ఛితంగా జరుగుతుంది అనే పాయింట్‌తో ఈ సినిమా స్టార్ట్‌ చేశాం. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి, దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు ఎమోషనల్‌ అయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ముగ్ధులం అయ్యాం. అడాప్టెడ్‌ సన్‌ అంటూ నామీద మీమ్స్‌ వస్తున్నాయి. నన్ను మీలో ఒకడిగా చేర్చుకున్నందుకు థ్యాంక్స్‌ అన్నారు.  

సినిమాలో ఎమోషన్‌ కనెక్టయితే,  అన్ని పాత్రలూ కనెక్టవుతాయి అని నిరూపించిన రాజమౌళీ నాకు స్పూర్తి. ప్రేమ, స్నేహం, తల్లిదండ్రులు అనేవి యూనివర్సల్‌ కాన్సెప్టులు. ఈ మూడూ ఈ సినిమాలో ఉంటాయి. అందుకే సినిమా అంత పెద్ద హిట్‌ అయ్యింది అని దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు అన్నారు. ఇంకా చిత్ర నిర్మాతల్లో ఒకరైన కల్పాతి అర్చనతో పాటు మైత్రీ అధినేతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్‌, మైత్రీ శశిధర్‌, సంగీత దర్శకుడు లియోన్‌ జేమ్స్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events