గోపీచంద్ హీరోగా ఏ.హర్ష దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన భీమా చిత్రం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భీమా థాంక్స్ మీట్‌కు ముఖ్య అతిథిగా సంపత్‌నంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైథాలజీ, ఫాంటసీ కలబోసి ఈ సినిమాను అద్భుతంగా తీశారు. క్లైమాక్స్ ఫైట్ చూసిన ప్పుడు పరశురాముడు ఇలానే ఉంటాడేమో అనిపించింది. గోపీచంద్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ సినిమా బాగుందని, రెండు కారెక్టర్స్‌లో నేను చక్కటి వేరియేషన్స్ చూపించానని అందరూ ప్రశంసిస్తున్నారు. యాక్షన్, గ్రాఫిక్స్‌తో ఎక్స్‌ట్రార్డినరీ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించే చిత్రమిది. ఈ స్థాయి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. గోపీచంద్‌కు మాస్‌పల్స్ బాగా తెలుసునని, క్లైమాక్స్ ఘట్టాలు అదిరిపోయానని దర్శకుడు మారుతి అన్నారు. ఈ సినిమా అంచనాలను అందుకుందని, రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయని నిర్మాత రాధామోహన్ పేర్కొన్నారు.