Skip to main content

Namaste NRI

అమెరికాలో జోరందుకున్న థాంక్స్‌ గివింగ్‌ డిన్నర్స్‌

అమెరికాలో సంప్రదాయబద్ధ థాంక్స్‌ గివింగ్‌ డిన్నర్స్‌ (కృతజ్ఞత విందులు) జోరందుకున్నాయి. దీనిలో భాగంగా నోర్‌ఫోక్స్‌ నేవీ స్థావరంలో సైనిక సిబ్బంది కుటుంబాలకు అధ్యక్షుడు జో బైడెన్‌ ఫ్రెండ్స్‌ గివింగ్‌ విందు ఇచ్చారు. బంగాళాదుంపతో చేసిన వంటకాన్ని అధ్యక్షుడే స్వయంగా వడ్డించారు. చిలకడదుంపతో తయారైన మరో వేడివేడి వంటకాన్ని ఆయన సతీమణి జిల్‌ అతిథులకు వడ్డించారు. ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధం వేళ మోహరించిన విమాన వాహక యుద్ధనౌకలైన ఐసన్‌ హోవర్‌, గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ సిబ్బంది దీనికి హాజరయ్యాయి. ఇజ్రాయెల్‌`హమాస్‌ ఘర్షణల నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండు నౌకలను మధ్యధరా సముద్రంలో మోహరించారు. 

Social Share Spread Message

Latest News