పెహల్‌గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా స్పందించారు. దాడి తర్వాత విస్తృత ప్రాంతీయ సంఘర్షణలకు దారితీయకుండా భారత్ స్పందన ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను వేటాడటంలో ఆ దేశం భారత్‌కు సహకరించాలని కోరారు.

కాగా, జేడీ వాన్స్ తన ఫ్యామిలీతో భారత పర్యటనలో ఉన్న సమయంలోనే పెహల్‌గామ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించారు. పర్యాటకులపై దాడి దిగ్భ్రాంతికర విషయమన్నారు. ఈ దాడిపై భారత్ ప్రతిస్పందించడం సరైనదేనని వ్యాఖ్యానించారు. అయితే, విస్తృత ప్రాంతీయ సంఘర్షణలకు దారితీయని విధంగా భారత్ స్పందన ఉంటుందని విశ్విస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ కూడా ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను వేటాడటంలో భారత్‌కు సహకరించాలని సూచించారు.
