ఉగ్రవాద కార్యకలాపాలకు తన భూభాగాన్ని ఎవరూ ఉపయోగించుకోకుండా అఫ్గానిస్థాన్ చూడాలని భారత్, ఆస్ట్రేలియాలు స్పష్టం చేశాయి. ముష్కర ముఠాల శిక్షణ, కార్యకలాపాలకు ఆ దేశం మరోసారి సురక్షిత అవాసం కాకూడదన్నారు. చైనా దురుసుతనం ప్రదర్శిస్తున్న భారత్`పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సుసంపన్న పరిస్థితులను నెలకొల్పేందుకు కలిసి పని చేయాలని కూడా నిర్ణయించాయి. భారత్, ఆస్ట్రేలియాల విదేశీ, రక్షణ మంత్రులు ఢల్లీిలో సమావేశమయ్యారు. ఈ ప్రాంతంలో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో తొలిసారి జరిగిన ఈ 2G2 చర్చలకు ప్రాధాన్యం ఏర్పడిరది. ఈ భేటీలో భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ఖ సింగ్‌లు, ఆస్ట్రేలియా పక్షాన విదేశాంగ మంత్రి మారిస్ పెయిన్, రక్షణ పీటర్ డట్టన్‌లు పాల్గొన్నారు.