ఫైనాన్సియల్ వరల్డ్‌ను బ్లాక్ చైన్ టెక్నాలజీ పునర్నిర్వచిస్తుందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇనిఫిటి ఫోరం ఆయన మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీతో బ్లాక్ చైన్ టెక్నాలజీ విభిన్నం అని స్పష్టం చేశారు. డిజిటల్ సొసైటీ పునాదులపై దేశంలో డిజిటల్ ఫస్ట్ రివల్యూషన్ ఆవిష్కృతం కానున్నదని అన్నారు. ట్రస్ట్ బేస్డ్ సొసైటీలో ట్రస్ట్ ఆధారిత లావాదేవీలకు బ్లాక్ చైన్ టెక్నాలజీ చాలా ముఖ్యమైన ఫ్రేమ్ వర్క్ రూపకల్పనకు భూమిక కానున్నదన్నారు. డేటా ప్రైవసీ బిల్లు, క్రిప్టో కరెన్సీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముకేశ్ అంబానీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడిరది. భారత్‌తో డిజిటల్ రివల్యూషన్ క్రెడిట్ ప్రధాని నరేంద్ర మోదీకి చెల్లుతుందని, అందుకు ఆయనకు ధన్యవావాదలు తెలుపుతున్నట్లు అంబానీ తెలిపారు.