Skip to main content

Namaste NRI

ఈ సినిమాతో ఆ కల నెరవేరింది : జ్యోతి పూర్వాజ్‌

స్వీయ దర్శకత్వంలో పద్మనాభరెడ్డితో కలిసి పూర్వాజ్‌ నిర్మించిన ఉమెన్‌ సెంట్రిక్‌ స్పైథ్రిల్లర్‌ కిల్లర్‌. జ్యోతి పూర్వాజ్‌ కథానాయిక. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. కథానాయిక జ్యోతి పూర్వాజ్‌ మాట్లాడుతూ ఇందులోని నా పాత్రలో ఆరేడు షేడ్స్‌ ఉంటాయి. విజయశాంతిలా యాక్షన్‌ సినిమాలు చేయాలనేది నా డ్రీమ్‌. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది. ఈ సినిమాకోసం డైరెక్టర్‌ పూర్వాజ్‌ చాలా కష్టపడ్డారు.నటిగా నాకు, దర్శకుడిగా పూర్వాజ్‌కీ మంచి పేరు తెచ్చే చిత్రమిది అని నమ్మకంగా చెప్పారు.

ఆర్టిఫిషియల్‌ ఇటెలిజెన్స్‌, ఎమోషనల్‌ డ్రామా, బ్రదర్‌-సిస్టర్‌ బాండింగ్‌, రివేంజ్‌, సబ్‌ కాన్షియస్‌ ఐడెంటిటీ, అంశాల మేళవింపుగా రూపొందిన స్పై థ్రిల్లర్‌ ఇదని, స్క్రీన్‌ప్లేలో మల్టీ లేయర్లున్నా, అందరికీ సినిమా అర్థమవుతుందని, త్వరలోనే సినిమాను రిలీజ్‌ చేస్తామని దర్శకుడు పూర్వాజ్‌ తెలిపారు. ఇంకా లైన్‌ ప్రొడ్యూసర్స్‌ సీతారామారావు, దశరథ మాధవ్‌, మనీష గిలాడ, గౌతమ్‌ చక్రధర్‌, విశాల్‌రాజ్‌, శ్రీనివాస్‌, చందు, కాళీచరణ్‌ కూడా మాట్లాడారు.త్వరలో సినిమా విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News