Namaste NRI

ఈ సినిమాతో ఆ కల నెరవేరింది :సంతోష్‌ శోభన్‌

సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ కపుల్‌ ఫ్రెండ్లీ. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం. యూవీ కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ విజయంతో తన నమ్మకం నిజమైందని, ఈ సక్సెస్‌ క్రెడిట్‌ దర్శకుడిదేననీ, సంతోష్‌శోభన్‌కి హిట్‌ రావడం ఆనందంగా ఉందని, ప్రేమకథలకు తను చిరునామా కావాలని పంపిణీదారుడు ధీరజ్‌ మొగిలినేని అన్నారు. ఈ విజయానికి టీమ్‌ సహకారమే కారణమని దర్శకుడు చెప్పారు.

నా సినిమా థియేటర్ల ముందు హౌస్‌ఫుల్‌ బోర్డులను చూడాలనేది నా కల. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది. ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయమిది. టీమంతా ప్రాణం పెట్టి పనిచేశారు కాబట్టే ఈ విజయం సాధ్యమైంది. ఈ సినిమా విజయం నటుడిగా నా బాధ్యతను పెంచింది అని సంతోష్‌ శోభన్‌ పేర్కొన్నారు. ఇంకా నిర్మాత అజయ్‌కమార్‌ రాజు.పి, కథానాయిక మానస వారణాసి కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News